IVF and IUI Treatment for Infertility in Telugu
ఐ వి ఎఫ్ మరియు ఐ యూ ఐ పద్దతిలో సంతాన లేమికి కచ్చితమైన పరిష్కార మార్గాలు
పిల్లల్ని కనే సామర్థ్యం అనేది మహిళలకు లభించడం ఒక వరం వంటిది. మహిళ శరీరం మరో ప్రాణికి జన్మనివ్వడానికి అనుగుణంగా తయారై ఉంది. కానీ, కొన్ని సార్లు ప్రకృతి అనేది సహకరించదు. ఈ రోజుల్లో ఒత్తిడి వలన అలాగే అనారోగ్యకరమైన జీవనశైలి వలన ఫెర్టిలిటీపై దుష్ప్రభావాలు పడుతున్నాయి. ఈ రోజుల్లో ఫిమేల్ ఇంఫెర్టిలిటీ అనేది సీరియస్ హెల్త్ కండిషన్ గా మారిపోయింది. ప్రతి ఆరుగురిలో ఒక జంట పిల్లల్ని కనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. డైట్ అనేది ఫెర్టిలిటీను పెంచేందుకు దోహదపడుతుంది. ఈ విషయంపై అనేక రీసెర్చ్ లు చేయబడ్డాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఫెర్టిలిటీను పెంపొందించుకోవచ్చు.
IUI (ఇంట్రాయుటెరైన్ ఇన్సేమినేషన్) మరియు IVF (ఇన్ వట్రో ఫెర్టిలైజేషన్) అనేవి ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం చెందిన రెండు రకాల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఈ రెండూ కన్సీవింగ్ యొక్క అవకాశాలను పెంపొందిస్తాయి. ఫెర్టిలిటీ ఇష్యూస్ ని మీరు కూడా ఎదుర్కొంటున్నారా? దిగులు చెందకండి. ఫెర్టిలిటీ సమస్యకు మోడరన్ మెడికల్ టెక్నాలజీస్ ద్వారా పరిష్కారం అందుతుంది. ఫెర్టిలిటీ సమస్యల గురించి డాక్టర్ ను సంప్రదించినప్పుడు మీకు IUI లేదా IVFను సూచించవచ్చు.
ఈ రెండు టర్మ్స్ అనేవి రీప్రొడక్టివ్ టెర్మినాలజీ కి సంబంధించినవి. అయితే, ఈ రెండిటి ట్రీట్మెంట్ విధానం పూర్తిగా డిఫెరెంట్ గా ఉంటుంది. ఒకదానితో ఒకటి ఈ రెండు ట్రీట్మెంట్స్ ఏ విధంగా డిఫరెంట్ గా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? మీకు ఏది బాగా సూట్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా? ఈ రెండిటి బెనిఫిట్స్ ఏంటి? అయితే, మీరు సరైన పేజీని సందర్శించారు.
IUI ట్రీట్మెంట్ అనేది దంపతులలోని ఇంఫెర్టిలిటీని క్యూర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. వైద్యపరంగా కృత్రిమ పద్దతులను అభివృద్ధి చేసి కన్సీవ్ అయ్యేందుకు ఈ చికిత్స తోడ్పడుతుంది. దీనిని ఇనీషియల్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ గా పేర్కొంటారు. IUI అనే పేరులోనే దీని సారాంశం మొత్తం ఉంది. మహిళ యొక్క యుటెరస్ లోకి కాన్సెన్ట్రేటెడ్ మోటైల్ స్పెర్మ్స్ ను నేరుగా ప్రవేశపెడతారు. మేల్ పార్ట్నర్ యొక్క స్పెర్మ్స్ వీక్ గా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ను అనుసరిస్తారు.
IUIకి చెందిన స్టెప్స్ ఇవి
- స్పెర్మ్స్ ని ప్రాసెస్ చేయడానికి “వాషింగ్” అనే టెక్నీక్ ను ముందుగా పాటిస్తారు. ఈ టెక్నీక్ అనేది మృతి చెందిన అలాగే నెమ్మదిగా ఉన్న స్పెర్మ్స్ ను తొలగించి హైలీ కాన్సెన్ట్రేటెడ్ మొటిలిటీ స్పెర్మ్స్ ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. ఈ స్పెర్మ్స్ వలన కన్సెప్షన్ అవకాశాలు పెంపొందుతాయి.
- ఈ ప్రొసీజర్ ని ఒవ్యులేషన్ పీరియడ్ లో పాటిస్తారు. అలాగే ఒవ్యులేషన్ ప్రారంభమైన ఒకటి లేదా రెండు రోజులలో కూడా ఈ పద్దతిని పాటించే అవకాశాలున్నాయి.
- మంచి స్పెర్మ్స్ ను నేరుగా మహిళ యొక్క సెర్విక్స్ లోకి ప్రవేశపెడతారు. ఒవ్యులేషన్ పీరియడ్ తరువాత అండం ఫాలోపియన్ ట్యూబ్ లో ప్రవేశించినప్పుడు ఇంజెక్షన్ ను ఇస్తారు. ఇప్పుడు, హై క్వాలిటీ స్పెర్మ్స్ తో ఎగ్స్ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- పీరియడ్స్ కి ముందు అలాగే పీరియడ్స్ అయిన వెంటనే స్పెర్మ్స్ ను మహిళలో ప్రవేశపెట్ట్టేందుకు సరైన సమయం. 5. ఈ సమయంలో కన్సీవింగ్ ఛాన్సెస్ ను మెరుగుపరిచేందుకు వైద్యులు ఓరల్ మెడిసిన్స్ ను కూడా సూచించే అవకాశాలు కలవు.
ఇంఫెర్టిలిటీ సమస్యకు IVF అనేది ఎంతో పాప్యులర్ అయిన చికిత్స. ఈ టర్మ్ ను మీరెన్నో సార్లు విని వుంటారు. IVF అంటే ఏంటి? ఈ ట్రీట్మెంట్ ని ఎలా చేస్తారు? ఇది మీకు సూటబుల్ గా ఉంటుందా? ఈ ప్రశ్నలకి సమాధానం గురించి ఈ ఆర్టికల్ ను చదవండి. ఈ ప్రాసెస్ లో మంచి స్పెర్మ్స్ ను పురుషుడి నుంచి ఆలాగే ఎగ్ ను మహిళ నుంచి కలెక్ట్ చేస్తారు. వట్రోలో ఫెర్టిలైజ్ చేస్తారు. అంటే యుటెరస్ కాకుండా ఈ పద్దతిని ఎంచుకుంటారు. ఈ ప్రాసెస్ అనేది IUI కంటే ఎంతో ఖరీదైనది. ఇదెలా చేస్తారో ఇప్పుడు చూడండి.
- ఈ ప్రాసెస్ లో ఒకటి కంటే ఎక్కువ ఎగ్స్ ను ఉత్పత్తి చేయడానికి ఓవరీస్ ను ప్రేరేపించడంతో ప్రారంభమవుతుంది.
- ఓవరీస్ నుంచి ఎగ్స్ ను సేకరిస్తారు. ఇది ఈ ప్రాసెస్ లో ముఖ్యమైన అంశం.
- ఫెర్టిలైజేషన్ కి ముందే డోనార్ లేదా పార్ట్నర్ తమ స్పెర్మ్స్ శాంపిల్ ను అందించాలి. లేబరేటరీలో ఎగ్ ఫెర్టిలైజేషన్ చోటుచేసుకుంటుంది.
- ఈ ఫెర్టిలైజడ్ ఎగ్స్ ను IVF లేబరేటరీలో మూడు నుంచి ఐదు రోజుల వరకు పొందుబరుచుతారు. ఈ సమయంలో ఎంబ్రియోస్ రూపొందుతాయి (ఎగ్ సెల్స్ అనేవి డివైడ్ అయి మల్టిప్లై అవడం ప్రారంభిస్తాయి).
- అలా ఏర్పడిన ఎంబ్రియోస్ ని మహిళ యొక్క యుటెరస్ లోకి ప్రవేశపెడతారు. మహిళ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ లో సమస్య తలెత్తినప్పుడు ఈ ట్రీట్మెంట్ ను ప్రిఫర్ చేస్తారు.
1) IUI తో పోల్చితే IVF అనేది అత్యంత ఖరీదైన ఫెర్టిలిటీ చికిత్స. IUI అనేది కాస్తంత కాస్ట్ ఎఫెక్టివ్. కొన్ని క్లినిక్స్ లో దీని ఖరీదు దాదాపు రూ.10,000 ఉండవచ్చు.
2) IVF అనేది IUI తో పోల్చితే అత్యంత సక్సెస్ఫుల్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ గా పేరొందింది.
3) IUI తో పోలిస్తే IVF లో పాటించే ప్రాసెస్ అనేది సంక్లిష్టమైనది అలాగే ఎక్కువ సమయం తీసుకునేది కూడా.
4) సాధారణంగా IUI సక్సెస్ రేట్ అనేది 15 నుంచి 20 శాతం వరకు ఉంటుంది. IUI ప్రాసెస్ కు అనుబంధంగా కొన్ని ఫెర్టిలిటీ డ్రగ్స్ ను తీసుకుంటూ ఉంటే కన్సీవ్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉంటాయి.
5) IVF ద్వారా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు IVF లేబరేటరీ నాణ్యతకు చెందిన విషయాలపై, మహిళ యొక్క వయసుపై అలాగే ఇంఫెర్టిలిటీ కారణాలపై ఆధారపడి ఉంటాయి.
6) IUI లో కేవలం ఒక ఇంజెక్షన్ తో పాటు కొన్ని మెడికేషన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. IVF లో మహిళకు 8 నుంచి 12 రోజులలోనే ఎన్నో ఇంజెక్షన్స్ ను ఇస్తారు. ఈ రెండు మెథడ్స్ కి వాటి వాటి ప్రొసీజర్స్ ను పాటిస్తారు. అయితే, ఈ రెండు మెథడ్స్ ద్వారా ఫెర్టిలిటీ అవకాశాలను పెంపొందించుకోవచ్చు. వీటిలో మీకు ఏ మెథడ్ సూట్ అవుతుందో అనేది వివిధ ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంటుంది. వయసు, స్పెర్మ్స్ స్ట్రెంత్, ఇంఫెర్టిలిటీ కారణాలను పరిగణలోకి తీసుకోవాలి. అందువలన, మీరు మీ ఫిజీషియన్ తో డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఆ తరువాత, మీకేది సూట్ అవుతుందో ఏది మీకు కన్వీనియెంట్ గా ఉంటుందో తెలుస్తుంది.
- పురుషుడి స్పెర్మ్ యొక్క నాణ్యతను అలాగే మహిళల్లో హార్మోన్ల స్థాయిలను తెలుసుకునేందుకు పరిపూర్ణమైన చెకప్ జరుగుతుంది.
- మెన్స్ట్రువల్ సైకిల్ ను మానిటర్ చేస్తారు. ఎగ్స్ లోని ఫాలికల్స్ అభివృద్ధిని గమనించేందుకు అల్ట్రా సౌండ్స్ ను పెర్ఫామ్ చేస్తారు.
- ఎగ్స్ పెరిగేందుకు పరిణతి చెందేందుకు మరియు చివరికి ఒవ్యులేట్ అయ్యేందుకు హార్మోన్స్ ని గమనిస్తారు.
- మీరు ఎంచుకున్న ప్రొసీజర్ ప్రకారం, స్పెర్మ్స్ ను యుటెరస్ లో ప్రవేశపెట్టడం గాని లేదా ఎగ్స్ ను తొలగించి లేబరేటరీలో ఫెర్టిలైజ్ చేయడం గానీ జరుగుతుంది.
ఈ ప్రొసీజర్ తరువాత ఎంబ్రయో ఇంప్లాంటేషన్ ఈ ప్రొసీజర్ తరువాత ఎంబ్రయో ఇంప్లాంటేషన్ (IVF) లేదా ఇన్సేమినేటింగ్ (IUI) ని అనుసరిస్తారు. ఫలితం కోసం మీరు కొన్ని వారాలు వేచి చూడాలి. ఆ తరువాత ఈ టెస్ట్ యొక్క ఫలితాన్ని వైద్యులు మీకు తెలుపుతారు. ఈ సమయంలో సాధారణ జీవితాన్ని గడపండి. ఒత్తిడికి గురవకండి. మంచినే ఆశించండి. నెగటివ్ రిజల్ట్స్ వస్తే కలత చెందకండి.
ఈ సమాచారం అనేది కేవలం ఈ ప్రొసీజర్ల గురించి మీకు సంక్షిప్త వివరణను అందించడానికి మాత్రమే. ఈ సమాచారం వలన ఈ ప్రొసిజర్స్ గురించి మీకున్న సందేహాలు నివృత్తి అయ్యాయని ఆశిస్తున్నాము. లోతైన విశ్లేషణ కోసం మెడికల్ ప్రొఫెషనల్ ను సంప్రదించండి. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము.
MD, DGO, DNB, MRCOG, MSC (Embryology UK)
Sub-specialist in Reproductive Medicine & Surgery (RCOG, UK)
Director and Fertility Specialist, MotherToBe
Head of Department & Consultant Fertility Specialist, KIMS, Secunderabad.